Dark net episode 14 in Telugu Crime Stories by Abdul Sattar books and stories PDF | డార్క్ నెట్ ఎపిసోడ్ - 14

Featured Books
Categories
Share

డార్క్ నెట్ ఎపిసోడ్ - 14

అలా ఆర్య  విష్ణు ని డ్రాప్ చెయ్యడానికి కార్ లో విజయవాడ కి స్టార్ట్ అవుతాడు. ఆర్య విజయవాడ కి వెళ్ళేటప్పుడు దారి మధ్య లో కార్ కి మధ్య నా కాకి కరెంటు కొట్టిన కాకి ఆర్య కార్ కి మధ్య నా పడుతుంది. అది చుసిన విష్ణు చాలా అంటే చాలా షాక్ అవుతాడు.

( విష్ణు ) : చూడు ఆర్య ఇలా మన ఎక్కడికి అయినా బయటికి వెళ్ళేటప్పుడు నల్ల పిల్లి కానీ అలాగే కాకి కానీ ఇలా మనం వేలేటపుడు మనకి ఎదరు రావడం చాలా ప్రమాదం నా మాట విని మనం కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత కావాలంటే మళ్ళీ మనం స్టార్ట్ అవుదాం.

అని విష్ణు  ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : సార్ ఇలాంటివి అని మాములే సార్ నేను చాలా చూసేను సార్ మీరేం బయపడకండి సార్ నేను చూసుకుంటాను. సార్ 

అని చెప్పి ఆర్య  ఆ చచ్చిపోయిన కాకి ని పక్కకి పడేస్తాడు.పడేసి ఆర్య కార్ స్టార్ట్ చేసి మళ్ళీ విజయవాడ కి స్టార్ట్ అవుతాడు.

కానీ ఆర్య కి కూడా కొంచెం ఆ నల్ల కాకి కార్ కి అడ్డం గా రావడం కొంచెం ఆందోళన  గా ఉంటుంది.

ఆర్య కొంచెం ఆలోచన లోకి వెళతాడు.

 అంటే ఆర్య కి ఉన్న ఆలోచన  ఒకటే  కిరణ్ శవాన్ని  పోస్టుమార్టం  చేయడానికి వచ్చేటప్పుడు కారు కి అడ్డం గా వచ్చిన స్వామీ జీ ఎవరు  మళ్లీ ఆయన  ఆత్మ రూపం లో ఎందుకు మాయం అయిపోయాడు. అని ఆర్య కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్య ఆలోచించడం విష్ణు గమనిస్తాడు.

 అలా తర్వాత  విష్ణు ఆర్య ని  అడుగుతాడు. ఏంటి ఆర్య దేని గురించి ఆలోచిస్తున్నావ్. అని విష్ణు   ఆర్య ని  అడుగుతాడు.

 అలా ఆర్య కి  అలాగే విష్ణు కి మధ్య సంభాషణ జరుగుతుంది.

( ఆర్య ) : ఏం లేదు విష్ణు గారు  మనం కిరణ్ శవాన్ని పోస్టుమార్టం  చేయడానికి వచ్చేటప్పుడు కారు కి అడ్డం గా వచ్చిన ఆ సామి జి ఎవరు అసలు నాకేం అర్థం కావడం లేదు. అంటే ఆయన మళ్ళీ ఆత్మ రూపం లో  ఎందుకు మాయం అయిపోయాడు. అంటే ఆయన  దైవమా లేకుంటే ఆయన దయ్యమా  అనేది నాకు ఏం అర్థం కావడం లేదు. విష్ణు గారు  

 అని ఆర్య  విష్ణు తో  అంటాడు.

( విష్ణు ) : చూడు ఆర్య  ఇప్పుడు ఎందుకు అదం తా   దాని గురించి తలచు కుంటూ ఉంటే నాకే భయమేస్తుంది. అసలు ఎవరు అయినా  దైవమా లేకుంటే దెయ్యమా  లేకుంటే ఆత్మ నా  అనేది నాకు కూడా  అర్థం కావడం లేదు. ఆర్య 

 అని విష్ణు ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అయిన ఎవరో  నాకైతే తెలియదు సార్  నాకు మాత్రం ఒకటి అయితే పక్కాగా అర్థమైంది సార్  

 అని ఆర్య   విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : ఏం అర్థమైంది. ఆర్య  నీకు

 అని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : ఆయన మన తో ఏదో చెప్పాలని వచ్చారు సార్ అక్కడికి నాకు  అయన ఏదో హింట్ ఇవాలి చూసేరు సార్ కానీ ఆయనఏం హింట్ ఇవ్వాలి అనుకున్నారో నాకు అయితే అర్థం కాలేదు.సార్ 

అని ఆర్య విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : అయన మన తో ఏం చెప్పాలి అనుకున్నాడో ఏం చెప్పదు. అని అనుకున్నాడో అదంతా పక్కన పెట్టి ముందు మనం విజయవాడ కి వెళుతున్న పని మీద ద్రుష్టి పెట్టు 

అని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అవును సార్ మనం విజయవాడ కి వెళ్లి రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కలిసి రాజేష్ గురించి తెలుసుకొని రాజేష్ ఇంట్లో రాజేష్ రూమ్ లో మనం ఏమైనా వెతికితే మనకి ఏమైనా ఆధారాలు ఏమైనా దొరుకుతాయి. ఏమో చూదాం అని సార్ ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : అవును మనం రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ ని కలవాలి నీకు Dsp వర్ధన్ గారు ఇచ్చిన రాజేష్ ఫైల్ లో  రాజేష్ గురించి అలాగే రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ గురించి  అలాగే రాజేష్ కి సంబంధించిన  ఇంటి అడ్రస్ గురించి  అందులో మొత్తం ఉంది. మనం విజయవాడ కి వెళ్లగానే మనం మా ఇంటికి వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి  తీసుకున్న తర్వాత  కావాలంటే రాజేష్ వాళ్ళ ఇంటికి  వెళ్దాం 

 అని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అలాగే సార్  మనం విజయవాడకు వెళ్లిన తర్వాత మీ ఇంటికి వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి ని తీసుకొని కావాలంటే మనం విశ్రాంతి  తీసుకున్న తర్వాత మనం రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ కి కాల్ చేసి వాళ్ళు ఇంట్లో ఉన్నారు లేదో  తెలుసుకొని మనం రాజేష్  వాళ్ళ ఇంటికి వెళ్దాం సార్ 

అని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : అలాగే ఆర్య 

అని విష్ణు  ఆర్య అంటాడు.


ఇలా విష్ణు   అలాగే ఆర్య ఇద్దరు రాత్రి 12.50 కి విజయవాడ కి చేరుకుంటారు. తరువాత ఆర్య విష్ణు వాళ్ళ ఇంట్లో నే ఆ రోజు రాత్రి అంత విశ్రాంతి తీసుకుంటారు. 

ఇంత మార్నింగ్ అవుతుంది. ఆర్య మార్నింగ్ లేచ్చి బయటికి వెళ్లి టీ తాగుతాడు. ఆర్య కనపడటం లేదు. అని విష్ణు   ఆర్య కి కాల్ చేస్తాడు. ఆర్య విష్ణు చేసిన కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. 

విష్ణు  అలాగే ఆర్య కి మధ్య కాల్ లో సంభాషణ జరుగుతుంది.

( ఆర్య ) : చెప్పండి సార్ కాల్ చేసేరు.

అని ఆర్య విష్ణు ని అడుగుతాడుఎం

( విష్ణు ) : మార్నింగ్ ఏ ఎక్కడికి వెల్లేవు ఆర్య ఇంటి లో కనపడటం లేదు.

అని విష్ణు ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : ఏం లేదు. సార్  టీ తాగాలని పిస్తుంటే నేను ఇలా బయటికి టీ స్టాల్ కి వచ్చాను.

సార్ అని ఆర్య  విష్ణు తో అంటాడు.

అప్పుడు విష్ణు  ఆర్య   మీద చాలా కోపోపాడుతాడు. 

( విష్ణు ) : నీకు కొంచెం అయినా తెలివి ఉందా ఆర్య ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు చేసేది. ఏంటి ఇప్ప్పుడు ఏమైనా అయి ఉంటే ఎవరు జవాబు దారి ఆర్య అసలు నాకు ఒక మాట చెప్పకుండా ఎందుకు వెల్లేవు నువ్వు ఆర్య  నువ్వు ఎక్కడ ఉన్న వెంటనే మా ఇంటి దగ్గర ఉండాలి.

అని విష్ణు   ఆర్య మీద చాలా కోపోపాడుతాడు.

( ఆర్య ) : అలాగే సార్ ఒక 10 నిమిషాల లో నేను అక్కడ ఉంటాను. సార్ కచ్చితం గా 

అని ఆర్య విష్ణు తో అంటాడు.

ఆలా ఆర్య కార్ వెళ్ళుతుండ గా ఆర్య మీద ఎవరు గుర్తు తెలియని వక్తులు దాడి చేస్తారు. ఆ గుర్తుకు తెలియని వక్తులు మొహానికి అందరూ నల్లని మాస్క్ లు వేసుకొని ఉంటారు. 

ఆర్య చాలా దైర్యం గా ఆ గుర్తుకు తెలియని వక్తులని నల్లటి మాస్క్ లు ధరించిన వక్తులను ఆర్య చాలా దైర్యం గా ఎదురుకుంటాడు.

అంటే ఆర్య అలాగే ఆ గుర్తుకు తెలియని వక్తుల మధ్య ఒక బికర యుద్ధం మొదలు అవుతుంది.

ఆర్య చాలా అంటే చాలా దైర్యం గా ఆ గుర్తుకు తెలియని నల్లటి మాస్క్ ని ధరించిన వ్వక్తులను ఆర్య చాలా కొడుతాడు. అలా అందరూ ఆర్య దెబ్బ కి అక్కడి నుండి పారిపోతారు. ఒక వ్వక్తి పారిపోయేటప్పుడు ఆర్య ఆ వ్వక్తి ఉన్న నల్లటి మాస్క్ తీద్దాం. అని ప్రయత్నిస్తాడు. కానీ అంత లోపు ఆ వ్వక్తి ఆర్య నుండి తప్పించుకొని పారిపోతాడు. 

అలా ఆర్య కూడా విష్ణు వాళ్ళ ఇంటి కి వెళ్లి పోతాడు.

ఆర్య   విష్ణు   వాళ్ళ ఇంటి కి వెళ్ళేక జరిగింది. మొత్తం ఆర్య  విష్ణు తో చెప్పుతాడు. అప్పుడు విష్ణు  ఆర్య మీద చాలా కోపోపాడుతాడు.

( విష్ణు ) : చూడు ఆర్య నీకు కొంచెం అయినా తెలివి ఉందా లేదా నీకు టీ తాగాలని ఉంటే నన్ను అడుగు నేనే ఇంట్లో చేసి పెడతాను. కదా అలాగే నీకు ఇంకా ఏమైనా తిన్నే వాటి లో అలా అవసరం అయితే నన్ను అడుగు నాకు అల్ మోస్ట్ అని వస్తాయి. ఆర్య చెయ్యడానికి నువ్వు ఏం మొహమాట పడకు ఆర్య నీకు ఏం కావాలి అన నేను చేసి పెడతాను. ఈ సారి నుండి నీకు ఏమైనా కావాలి. అంటే నువ్వు నన్ను మొహమాట పడకుండా అడుగు. ఆర్య అంతే కానీ నువ్వు మళ్ళీ నేను ఏమైనా అనుకుంటాను. అని మొహమాట పడటం అలా అనుకోను అలాగే నువ్వు మాత్రం ఒంటరి గా వేళ్ళకు బయటికి ఇప్పుడు పరిస్థితులు అలాగే మన టైమ్ కూడా బాగా లేదు ఆర్య ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. ఆర్య 

అని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : సరే సార్ మీరు చెప్పుతుంది. కూడా నిజమే సార్ కానీ ఇప్పుడు నాకు ఒకటి అర్ధం అవుతుంది. అలాగే ఇప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది. సార్ 

అని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : అవునా ఏంటి ఆర్య ఏం అనిపిస్తుంది. మీకు ఇప్పుడు ఇంతకీ మీకు ఏం అర్ధం అవుతుంది. ఆర్య

అని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : సార్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు. సార్ కానీ వాళ్ళు నన్ను నల్లటి మాస్క్ లు మొహానికి ధరించి నన్ను చంపుదాం. అని వాళ్ళు వచ్చారు. సార్ అంటే వాళ్ళు నన్ను చంపుదాం. అని ఇంత దూరం వచ్చారు. అంటే ఇప్పుడు నేను మొదలు పెట్టిన వెతుకులాట లో నాకు కొంచెం అయినా విజయం సమాకూరినట్టు గా నాకు అనిపిస్తుంది. సార్ అంటే వాళ్ళు నన్ను హైదరాబాద్ నుండే ఫాలో అవుతూ వాళ్ళు నా కోసం ఇంత దూరం వచ్చారు. 

సార్ అని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) :  అవును ఆర్య నువ్వు చెప్పుతుంది. కూడా నిజమే ఆర్య కానీ వాళ్ళు ఎవరో మనకి కూడా తెలియదు. కదా ఆర్య కానీ ఒకటి మాత్రం నిజం ఆర్య వాళ్ళు నిన్ను ఫాలో అవుతూ రావడం అయితే నిజం ఆర్య అంటే నాకు తెలిసి నువ్వు చెప్పినట్టు గా వారు నిన్ను హైదరాబాద్ నుండే ఫాలో అవుతూ వస్తున్నారు. అనే అనుమానం నాకు కూడా వస్తుంది. ఆర్య 

అని విష్ణు  ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : సరే సార్ అయింది. ఏదో అయిపోయింది. సార్ నేను దీని ఇంతటి తో వదిలేయాను. సార్ నేను ఆ నల్లటి మాస్క్ ల వెనుక ఉన్న వారి ని కచ్చితం గా ఎవరో తెలుసుకుంటాను. సార్ 

అని ఆర్య  విష్ణు తో అంటాడు.

( విష్ణు ) : సరే ఆర్య తెలుసుకుందాం. మనం నేను టిఫిన్ తిన్నడానికి దోశ అలాగే ఇడ్లీ చేస్తాను. నువ్వు అంత లోపు సానం చేసి రా ఆర్య 

అని విష్ణు   ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అలాగే సార్ అని చెప్పి ఆర్య సానం చెయ్యడానికి వాష్ రూమ్ లోపలికి వెళతాడు.


అలా ఆర్య సానం చేసి బయటికి రాగానే డైనింగ్ కేబుల్ మీద  టిఫిన్ తినడానికి ఇడ్లీ అలాగే దోశ  అలాగే ఎర్ర కారం అలాగే బొంబాయి చెట్ని  అలాగే సాంబారు అలాగే పల్లీల చట్నీ  అలాగే పల్లీల పొడి డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంటాయి.


 వీటిని చూసినా  ఆర్య  షాక్ అవుతాడు.

( ఆర్య ) :  ఏంటి సార్ ఇన్ని చేసేరు. మీరు అని 

ఆర్య  విష్ణు ని అడుగుతాడు.

( విష్ణు ) : ఏం కాదు. లే తిన్నడానీకె కధ మనం ఇప్పుడు కడుపు నిండా తిన్ని మనం రాజేష్ వాళ్ళ ఫ్యామిలీ వారికి కాల్ చెయ్యాలి. వాళ్ళని రాజేష్ గురించి అడిగి రాజేష్ గురించి మనం వివరాలు తెలుసుకోవాలి.

అని  విష్ణు ఆర్య తో అంటాడు.

( ఆర్య ) : అవును సార్ మరిచిపోయాను. అని 

ఆర్య  విష్ణు తో అంటాడు.

అలా ఇద్దరు కలిసి ఇడ్లీ అలాగే దోశ కడుపు నిండా తిన్ని రాజేష్ కేసు ఫైల్ లో ఉన్న రాజేష్ వాళ్ళ అన్న కి కాల్ చేస్తారు.

రాజేష్ వాళ్ళ అన్న కాల్ ని లిఫ్ట్ చేస్తాడు. రాజేష్ వాళ్ళ అన్న పేరు నితిన్.

( నితిన్ ) : హలో ఎవరు ఎవరు అని 

నితిన్ ఆర్య ని అడుగుతాడు.

( ఆర్య ) : సార్ నేను హైదరాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కాల్ చేస్తున్న సార్ విజయవాడ లో మీ తమ్ముడి రాజేష్ హత్య గురించి మీరు మాకు వివరాలు చెప్పితే మేము మీకు నాయ్యం జరిపిస్తాం. సార్ 

అని ఆర్య  రాజేష్ వాళ్ళ అన్న నితిన్ తో చెప్పుతాడు.

( నితిన్ ) : మాకు మీరు ఏ నాయ్యం చెయ్యాలిసిన అవసరం లేదు. మీరు మాకు కాల్ చేయకుంటే చాలు.

అని నితిన్  ఆర్య తో చెప్పి నితిన్ కాల్ ని కట్ చేస్తాడు.

తరువాత ఆర్య ఎన్ని సార్లు కాల్ చేసిన రాజేష్ వాళ్ళు అన్న నితిన్ కాల్ లిఫ్ట్ చెయ్యడు.

అలాగే రాజేష్ వాళ్ళ అన్న నితిన్ మొబైల్ ని స్విచ్ ఆఫ్ చేస్తాడు.

అలా ఆర్య రాజేష్ వాళ్ళ అన్న కి ఎన్ని సార్లు కాల్ చేసిన మొబైల్ స్విచ్ ఆఫ్ రావడం తో ఆర్య కూడా మళ్ళీ రాజేష్ వాళ్ళ అన్న నితిన్ కి కాల్ చెయ్యడు.


అలా ఆర్య కి ఒక 10 నిమిషాల తరువాత ఆర్య కి ఒక కాల్ వస్తుంది. ఆర్య కాల్ ని లిఫ్ట్ చేసేక ఆర్య కి కాల్ లో వాళ్ళు చెప్పిన విషయానికి ఆర్య చాలా షాక్ అవుతాడు. అంటే ఇప్పుడు ఇంకొక వ్వక్తి కూడా అలా ఆ కిల్లర్ unknown numbers తో కాల్ చేసి చంపేశాడు. కానీ ఈ మాట విన ఆర్య చాలా షాక్ అవుతాడు. 

ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 14 ముగిసింది.

డార్క్ నెట్ ఎపిసోడ్ 15 ఉంది.

అసలు ఆర్య కి ఇప్పుడు కాల్ చేసిన వారు ఎవరు? అలాగే ఇప్పుడు ఆ కిల్లర్ మళ్ళీ unknown numbers తో కాల్ చేసి మళ్ళీ ఎవరిని చంపాడు.

అలాగే కాల్ ని లిఫ్ట్ చేసి ఆర్య ఎందుకు షాక్ అయ్యాడు.

తరువాత ఏం జరుగుతుంది. అని తెలుసుకోవాలి. 

అని అనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 15 కోసం ఎదురు చూస్తూ ఉండాలి. 

 అప్పటి నుండి  ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క ఇప్పటి నుండి  స్టోరీ మొత్తం ఒక మలుపు తిరుగుతుంది.

కొనసాగుతుంది.